ప్రజలకు ఇచ్చిన హామీల్లో CM కేసీఆర్ ఏ ఒక్కటీ నెరవేర్చలేదంటూ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్(complaint) ఇచ్చారు. అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేసిన CMపై కేసు నమోదు చేయాలని కంప్లయింట్ లో తెలిపారు. గతేడాది జులై 17న భద్రాచలానికి వరదలు వచ్చిన సమయంలో పర్యటించిన KCR.. రూ.1100 కోట్లు కేటాయించినా పైసా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు భద్రాచలం వచ్చిన CM.. మళ్లీ వరదల సమయంలోనే అక్కడకు వచ్చారన్నారు. వరదలు వచ్చి ఏడాది పూర్తవుతున్నా సహాయక చర్యలకు ఇంతవరకు ఒక్క రూపాయి కేటాయించకపోవడం పరిస్థితికి నిదర్శనమని అన్నారు.
తొలిసారి వచ్చినపుడు రూ.100 కోట్లు.. రెండోసారి పర్యటనలో రూ.1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా ఒక్క రూపాయీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పట్టించుకోకపోవడంతో అధికారులకు బాధ్యత లేకుండా పోయిందని కంప్లయింట్ లో వివరించారు.