శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల(piligrims) కోసం దర్శన కోటా టికెట్లను తితిదే విడుదల చేస్తుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్(schedule) ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన కోటాను అధికారులు విడుదల చేస్తారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు పేర్లు నమోదు చేసుకోవచ్చు. అక్టోబరు మాసానికి సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడీప్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీడీప్ లో ఎంపికైన వారు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
మరికొన్ని సేవల టికెట్లు ఈనెల 21, 24న విడుదల
కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అక్టోబరు నెల అంగ ప్రదక్షిణ టికెట్ల కోటాను ఈనెల 24న ఉదయం పదింటికి విడుదల చేస్తారు.