గువాహటి(Guwahati)లో జరుగుతున్న IPL మ్యాచ్ లో రాజస్థాన్(RR)కు కోల్ కతా(KKR) బౌలర్లు చెక్ పెట్టారు. పరుగులు తీయడమే గగనమైపోయింది బ్యాటర్లకు. జైస్వాల్(29), శాంసన్(13), పరాగ్(25), నితీశ్ రాణా(8), హసరంగ(4), శుభమ్ దూబె(9), జురెల్(33), హెట్ మయర్(7) పెద్దగా ఆడకుండానే పెవిలియన్ చేరారు. జురెల్-హెట్ మయర్ జోడీపై నమ్మకం పెట్టుకున్నా ఆ ఆశలు అడియసలయ్యాయి. కోల్ కతా బౌలర్లు సమష్టిగా రాణించగా.. వైభవ్ అరోరా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది రాజస్థాన్.