భారత్ చిరకాల మిత్రదేశం రష్యా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ సదస్సుల్ని కూడా పట్టించుకోని పుతిన్.. భారత్ కచ్చితంగా రావాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergey Lavrov) తెలిపారు. రెండోసారి అధికారంలోకి రాగానే ప్రధాని మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన రష్యా. 2019 తర్వాత ఐదేళ్లకు 2024లో మోదీ అక్కడకు వెళ్లారు. ఇప్పుడు పుతిన్ కూడా అలాగే అనుకుంటున్నట్లు లావ్రోవ్ తెలిపారు. అయితే ఆయన టూర్ వివరాలు ఇంకా ఖరారు కాలేదు. పుతిన్ సైతం 2021 డిసెంబరులో భారత్ వచ్చారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక తిరిగి మూడేళ్లకు ఆయన మోదీ ఆతిథ్యం స్వీకరించనున్నారు.