హైదరాబాద్ మ్యాచ్ అంటే చాలు.. 270, 275, 280… ఇలా పరుగులకు అడ్డే ఉండదు. అలాంటి సన్ రైజర్స్ చాలా కాలం తర్వాత భిన్నమైన ఆట చూపించింది. లఖ్నవూ(LSG)తో మ్యాచ్ లో హెడ్(47) ఒక్కడే కాస్త మెరిపిస్తే అనికేత్(36), నితీశ్(32), క్లాసెన్(26) తక్కువ స్కోర్లు నమోదు చేశారు. దీంతో 150 దాటడానికే అపసోపాలు పడి 17వ ఓవర్లో పూర్తి చేసింది SRH. మ్యాచ్ మొదలయ్యాక మూడో ఓవర్లోనే అభిషేక్(6), ఇషాన్(0)ను శార్దూల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత మనోహర్(2), షమి(1)ని వెనక్కు పంపి మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 190/9తో నిలిచింది.