@ శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీరికి దాదాపు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం కోసం క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు సహా నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.