ఫిలిం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏవో రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ప్రత్యేకించి హీరో హీరోయిన్ల విడాకుల వార్తలు తరచూ వింటుంటాం. ఇక నాగ చైతన్య, సమంత డివోర్స్ అభిమానులకు పెద్ద షాక్ ఇవ్వగా.. ఇటీవలే మెగా డాటర్ నిహారిక సైతం తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ తన భర్తతో డివోర్స్ తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు కలర్స్ స్వాతి.
‘స్వామిరారా, సుబ్రమణ్యపురం, కార్తికేయ, త్రిపుర’ వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన స్వాతి కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. తను హైదరాబాద్లో, భర్త థాయిలాండ్లో ఉంటున్నారట. అయితే సడెన్గా ఆమె తన భర్త ఫొటోలను ఇన్స్టా నుంచి తొలగించిందట. దీంతో భర్తకు విడాకులు ఇవ్వనుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.