వక్ఫ్ బిల్లు చర్చ సందర్భంగా లోక్ సభలో ఆసక్తికర(Interesting) చర్చ నడిచింది. సమాజ్ వాదీ పార్టీ(SP) అధినేత అఖిలేశ్ యాదవ్.. BJPపై సెటైర్లు వేశారు. దీంతో అమిత్ షా వెంటనే లేచి రివర్స్ కౌంటరిచ్చారు. ఈ ఇద్దరూ నవ్వుతూనే సైటైర్, కౌంటర్ ఇచ్చుకోవడంతో సభంతా నవ్వులమయమైంది.
అఖిలేశ్…: లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకు BJP ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.. ఎవరు హిందూవాది అన్న పోటీ ఆ పార్టీ లీడర్ల మధ్య ఎక్కువైంది.. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అధ్యక్షుణ్ని ఎన్నుకోలేకపోతోంది..’.
అమిత్ షా…: నవ్వుతూ ప్రశ్న అడిగిన అఖిలేశ్ కు నవ్వుతూనే చెబుతున్నా.. అధ్యక్షుణ్ని ఎన్నుకునేందుకు అన్ని పార్టీలు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగుర్ని లెక్కలోకి తీసుకుంటాయి.. కానీ మేం 12-13 కోట్ల మంది సభ్యుల నిర్ణయం మేరకు ముందుకెళ్తాం.. అఖిలేశ్ గారు నేను చెబుతున్నా.. మరో 25 ఏళ్ల వరకు మీరే అధ్యక్షుడు..’.