గుజరాత్(GT)తో మ్యాచ్ లో బెంగళూరు(RCB) మొదట్లోనే టపటపా వికెట్లు కోల్పోయింది. 42 స్కోరుకే 4 వికెట్లు పడటంతో మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ మెల్లగా సాగింది. సాల్ట్(14), కోహ్లి(7), పడిక్కల్(4), పటీదార్(12) ఇలా వచ్చి అలా వెళ్లారు. కానీ హాఫ్ సెంచరీతో లివింగ్ స్టోన్ మళ్లీ పోటీలో నిలిపాడు. అతడికి జితేష్ శర్మ(33) సహకరించాడు. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 3 వికెట్లతో బెంగళూరును దెబ్బకొట్టినా చివర్లో టిమ్ డేవిడ్(32) అడ్డుపడ్డాడు. ఓవర్లు ముగిసేసరికి RCB 169/8 చేసింది.