రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడ్డట్లే కనిపిస్తోంది. ఉగాది(Ugadi) తర్వాత కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం(Oath) ఉంటుందని భావించారు. ఈ లెక్కన ఏప్రిల్ తొలివారంలోనే మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆశావహుల తాకిడి ఎక్కువవడంతో ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యేలా కనపడట్లేదు. తమ వర్గానికే పదవులు కేటాయించాలంటూ పలువురు అధిష్ఠానాన్ని కలిస్తే, మరికొందరు లేఖలు పంపారు. కేబినెట్లో 18 మంది మంత్రులకు గాను ప్రస్తుతం CMతో కలిపి 12 మంది ఉన్నారు. మరో ఆరుగురి నియామకాలు చేపట్టాల్సి ఉండగా, అందులో నాలుగు నుంచి ఐదు స్థానాలు భర్తీ అవుతాయని ప్రచారం జరిగింది. అన్నీ కుదిరితే ఈనెల 3న ప్రమాణస్వీకారం ఉంటుందని భావిస్తే అసలు ఎంపిక ప్రక్రియే ముందుకు సాగలేదు. మంత్రులతోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల్ని సైతం భర్తీ చేయాల్సి ఉంది.