25,000 మంది టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలు(Recruitments) రద్దు చేస్తూ సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. దీంతో మమతా బెనర్జీ సర్కారుకు భారీ షాక్ తగిలింది. ఎంపిక ప్రక్రియ మొత్తం మోసం, తారుమారు, అక్రమాలతో నిండిందని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగాలు తొలగించిన కలకత్తా హైకోర్టు.. తీసుకున్న జీతానికి 12% వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు బాధితులు. హైకోర్టు తీర్పును సమర్థించినా జీతాల రికవరీపై వెసులుబాటు కల్పించింది. 3 నెలల్లో కొత్త నియామకాలు జరపాలంటూ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. 2016 రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు పొందినవారు జీతాల్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పులో తెలిపింది. పూర్తి స్టోరీ కోసం https://justpostnews.com/national/bengal-teachers-recruitments-cancelled-by-supreme/ లింక్ క్లిక్ చేయండి…