పార్టీ ఫిరాయింపు కేసు విచారణ సందర్భంగా CM రేవంత్ రెడ్డి(Revanth)పై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై నిన్న మండిపడ్డ కోర్టు.. ఈరోజు సైతం అదే అంశాన్ని ప్రస్తావించింది. రేవంత్ అసెంబ్లీలో అన్న మాటల్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మరోసారి గుర్తు చేశారు. గతంలోనూ ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్స్ చేశారన్న ధర్మాసనం.. ఆనాడు తాము కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వకుండా తప్పు చేశామా అని వ్యాఖ్యానించింది. CM స్థాయిలో ఉన్నవారు సంయమనం పాటించాలని చెప్పగా.. రేవంత్ మాట్లాడిన పూర్తి వివరాల్ని అందజేస్తానని స్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. దీంతో పూర్తి నివేదికను అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి స్టోరీ కోసం https://justpostnews.com/national/supreme-court-on-cm-revanth-in-mlas-defection-case/ లింక్ క్లిక్ చేయండి