MLAలు పార్టీ మారిన వ్యవహారం కేసులో సుప్రీంకోర్టు సంచలన రీతిలో మాట్లాడింది. ఉప ఎన్నికలు రావు అంటూ CM రేవంత్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై మరోసారి మండిపడింది. ఈ అంశంపై నిన్ననే ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈరోజూ ప్రస్తావించింది. CM కామెంట్స్ ను కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది గుర్తు చేశారు. ‘CM కనీస స్వీయ నియంత్రణ(Self Control) పాటించలేరా.. గతంలో ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా అలాగే వ్యవహరిస్తారా అని జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రశ్నించారు.
అసెంబ్లీలో మాట్లాడితే కోర్టుల నుంచి రక్షణ ఉంటుందని భావించారని, ప్రతిపక్షం అంతకు మించి రెచ్చగొట్టిందని స్పీకర్ తరఫు కార్యదర్శి సింఘ్వి వివరించారు. అవన్నీ అప్రస్తుతమన్న బెంచ్.. CM మాటలు కోర్టు ధిక్కారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఎలాంటి తీర్పులు లేవన్న సింఘ్వి చెప్పగా.. మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటని ప్రశ్నించింది. ‘న్యాయవ్యవస్థగా మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండైన శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి.. సుప్రీంకోర్టులో కేసు వేశాకే ఫిరాయింపు MLAలకు స్పీకర్ నోటీసులిచ్చారు..’ అని జస్టిస్ కోర్టు గుర్తు చేసింది.