అధికార BJPపై పోరుకు జట్టు కట్టిన విపక్షాల కూటమికి కొత్త పేరు పెట్టారు. ‘ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్(INDIA)’ గా నామకరణం చేశారు. ఈ పేరుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపడంతో కొత్త పేరు అమల్లోకి వస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. మొత్తం 26 పార్టీలతో అలయెన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా కీలకమని, అందుకోసం తామంతా ఏకతాటిపై నిలబడి BJPని ఓడిస్తామని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదని, స్వప్రయోజనాల కోసం అధికారాన్ని దక్కించుకోవడం లక్ష్యం కాదని ఖర్గే అన్నారు. BJP ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అపోజిషన్ పార్టీ లీడర్లపై CBI, EDతో దాడులు చేయిస్తున్నదని, అందుకే తామంతా ఏకమై కమలం పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించామన్నారు.