దేశవ్యాప్తంగా పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పై రూ.2ను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ధరలు కాస్త పెరగనున్నాయి. పెరిగిన రేట్లు ఈరోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. పెంచిన ఈ ఎక్సైజ్ డ్యూటీ తో పెట్రోల్ పై రూ.13, డీజిల్ పై రూ.10 వసూలు చేసినట్లవుతుంది. అయితే ఎక్సైజ్ డ్యూటీ పెంచినా తాజా ధరల్లో మార్పులు ఉండబోవని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరిగిన ఎక్సైజ్ డ్యూటీని కంపెనీలే భరిస్తాయని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.