భాష మతం కాదని, ఉర్దూ(Urdu)ను ముస్లిం భాషగా పరిగణించడం వాస్తవికతకు, దయనీయమైన తిరోగమనానికి నిదర్శనమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘భాష మతం కాదు.. అది మతాన్ని సూచించదు.. భాష ఒక సమాజానికి, ప్రాంతానికి, ప్రజలకు చెందింది.. భాష అనేది సంస్కృతి.. ఒక సమాజం(Society), దాని ప్రజల నాగరికతను కొలవడానికి కొలమానం.. ఉర్దూ పరాయిది అనే అపోహ ఉంది.. మరాఠీ, హిందీలాగే ఉర్దూ ఇండో-ఆర్యన్ భాష.. ఇది ఈ భూమిలో పుట్టింది..’అని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ బెంచ్ స్పష్టం చేసింది. మహారాష్ట్ర అకోలా జిల్లాలోని ఒక మున్సిపల్ కౌన్సిల్ నేమ్ బోర్డుపై మరాఠీతోపాటు ఉర్దూ వాడకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇలా అభిప్రాయపడింది. ఇంకా పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి… https://justpostnews.com/national/language-is-not-religion-by-supreme/