ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Adityanath)పై పశ్చిమబెంగాల్ CM విరుచుకుపడ్డారు. ఆయన యోగి కాదు పెద్ద భోగి అంటూ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లును నిరసిస్తూ ఇమాంలు చేపట్టిన సభలో ఆమె మాట్లాడారు. ‘యోగి పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నారు.. ఆయన అసలు యోగి కాదు పెద్ద భోగి.. మహాకుంభమేళాలో ఎంతోమంది మృతిచెందారు.. ఎన్కౌంటర్లలో చాలా మంది చనిపోయారు.. UPలో ర్యాలీలు తీసేందుకు అనుమతి లేదు.. కానీ బెంగాల్లో అందుకు ఎంతో స్వేచ్ఛ ఉంది..’ అని మమత మండిపడ్డారు. వక్ఫ్ బిల్లు ఆందోళనలు చెలరేగి ముర్షిదాబాద్ రణరంగంగా మారడంతో మమత పట్టించుకోవట్లేదంటూ నిన్న యోగి ఆదిత్యనాథ్ విమర్శలు చేశారు.