సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) తదుపరి చీఫ్ జస్టిస్(CJI)గా జస్టిస్ బి.ఆర్.గవాయ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత CJI సంజీవ్ ఖన్నా పదవీకాలం వచ్చే నెల(మే) 13న ముగియనుంది. మే 14న జస్టిస్ గవాయ్ బాధ్యతల్లో చేరతారు. దీంతో భారత 52వ చీఫ్ జస్టిస్ గా ఆయన నిలుస్తారు. అత్యంత సీనియర్ అయిన జస్టిస్ గవాయ్ పేరును CJIగా సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. CJI సంజీవ్ ఖన్నా 2024 నవంబరులో బాధ్యతలు చేపట్టారు. భూషణ్ రామకృష్ణ గవాయ్(Gavai) 1960 నవంబరు 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేయించుకున్నారు. చేయించుకున్నారు. కంచ గచ్చిబౌలి భూముల కేసును విచారిస్తున్నది జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనమే.