ముస్లిమేతరుల(Non-Muslims)ను వక్ఫ్ కౌన్సిల్ లో నియమించొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. బిల్లుపై కేంద్రం వారం రోజుల్లో స్పందిస్తుందని సొలిసిటర్ జనరల్(SG) తుషార్ మెహతా తెలిపారు. తదుపరి విచారణను CJI సంజీవ్ ఖన్నా ధర్మాసనం వారం రోజులకు వాయిదా వేసింది. అప్పటివరకు ఆస్తులను డీ-నోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది.
వక్ఫ్ చట్టం సెక్షన్లు 9, 14 కింద కేంద్ర కౌన్సిల్, రాష్ట్ర బోర్డులకు ఎలాంటి నియామకాలు జరగబోవని స్పష్టతనిచ్చింది. గ్రామాలకు గ్రామాలనే వక్ఫ్ ఆస్తులుగా చూస్తున్నారంటూ లక్షల మంది ఫిర్యాదు చేశారని కోర్టుకు SG వివరించారు. ‘లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ గా క్లెయిమ్ చేశారు.. ఆస్తి, మొదలైన వాటిపై ప్రజల్లో ఎన్నో ప్రశ్నలున్నాయి.. దీనిపై మీరు విచారణ కొనసాగించవచ్చు..’ అని తుషార్ మెహతా కోర్టును కోరారు.