వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించినందుకు దావూదీ బోహ్రా(Dawoodi Bohra) అనే ముస్లిం కమ్యూనిటీ.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. ఆ సామాజికవర్గానికి చెందిన పలువురు మోదీని కలిశారు. కొత్త చట్టం సంతోషకరమని, ఇది చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ అని గుర్తు చేశారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే ప్రధాని దార్శనికతపై విశ్వాసముందన్నారు. వక్ఫ్ చట్టంపై(Waqf Act)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రధానిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరు షియా ఇస్మాలీ శాఖలోని ఒక తెగకు చెందిన వ్యక్తులు. బోహ్రాలు అపార విద్యావంతులు, సంపన్నులు కాగా, 40 దేశాల్లో స్థిరపడ్డారు.