ఆడితే 250, 270 కొట్టే సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) గత కొద్దిరోజులుగా చల్లబడిపోయినట్లుంది. తాజాగా ముంబయితో మ్యాచ్ లోనూ 150 దాటడానికి పడరాని పాట్లు పడింది. అభిషేక్(40; 28 బంతుల్లో), హెడ్(28), క్లాసెన్(37; 28 బంతుల్లో) ఇవే ఆ జట్టులో హయ్యెస్ట్ స్కోర్లు. బౌలర్లను ఉతికిపారేసే ట్రావిస్ హెడ్.. 28 పరుగులు చేసేందుకు 29 బంతులు తీసుకున్నాడు. ఇషాన్(2), నితీశ్(19), అనికేత్(3) ఆడకుండానే ఔటయ్యారు. 19.3 ఓవర్లకు 150 దాటిందంటే ఎంత నిదానంగా బ్యాటింగ్ సాగిందో అర్థమవుతుంది. చివరకు 162/5 చేసి ముంబయికి 163 పరుగుల లక్ష్యాన్ని విసిరింది.