భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన భగవద్గీత(Bhagavad gita)కు అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీతతోపాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో(UNESCO) గుర్తింపు లభించింది. వీటికి యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది. ఆలోచన, అనుభూతి, జీవించే, వ్యక్తీకరించే విధానాలకు తాత్విక, సౌందర్య పునాదులు వేసింది భగవద్గీత. యునెస్కో గుర్తింపును కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. భారతీయుల సంస్కృతి, జ్ఞానానికి దక్కిన గౌరవమని ప్రధాని మోదీ ‘X’లో ట్వీట్ చేశారు. భగవద్గీత, నాట్య శాస్త్రం శతాబ్దాలుగా నాగరికత, చైతన్యాన్ని పెంపొందించడమే కాక ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. https://justpostnews.com