సన్నీ డియోల్, రణదీప్ హుడా నటించిన బాలీవుడ్ సరికొత్త మూవీ ‘జాట్(Jaat)’పై కేసు నమోదైంది. ఒక వర్గం మనోభావాలు కించపరిచారంటూ పంజాబ్(Punjab) జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల(ఏప్రిల్) 10 సినిమా విడుదల కాగా.. క్రైస్తవ సమాజానికి చెందిన సీన్లు ఉన్నాయి. ఏసుక్రీస్తు పట్ల అగౌరవం చూపారని, చర్చి లోపల శిలువ కింద నిల్చొని ప్రజలు ప్రార్థనలు చేస్తున్న వేళ బెదిరింపు, వికృత దృశ్యాలు చిత్రీకరించారని ఫిర్యాదు దాఖలైంది. చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేనితోపాటు నిర్మాతలపై కేసు ఫైల్ అయింది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ నెలల్లో కావాలనే సినిమా విడుదల చేసి గందరగోళం సృష్టించాలని చూశారంటూ ఫిర్యాదు అందింది.