వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ బెంగాల్(West Bengal)లో అల్లర్లు జరిగి ముగ్గురు చనిపోగా.. బాధితుల్ని పరామర్శించాలని గవర్నర్ నిర్ణయించారు. ముషీరాబాద్, మాల్దా వెళ్లాలని గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ భావించగా, వద్దంటూ CM మమత వేడుకున్నారు. ముస్లిం ప్రాంతాలైన షంషేర్ గంజ్, సూతి, ధులియాన్, జంగీపూర్లో ఈనెల(ఏప్రిల్) 11, 12న అల్లర్లు జరిగాయి. అయితే గవర్నర్ అక్కడకు వెళ్లొద్దంటూ మమత అభ్యర్థించారు. ఇప్పటికే బాధితులు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రకటించామని గుర్తు చేశారు. ఈ ఘటనల్లో 274 మంది అరెస్టు కాగా.. జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) తీవ్రంగా స్పందించింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడకు వెళ్లాలని గవర్నర్, వద్దని మమత బతిమిలాడటం ఆశ్చర్యకరంగా మారింది. మరి ఆనంద్ బోస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.