11 ఏళ్ల బాలుడి కడుపులో 100 గ్రాముల బంగారు బిస్కెట్(Gold Biscuit) చూసి డాక్టర్లు షాకయ్యారు. కడుపు వాపుగా మారి, స్వెల్లింగ్ వస్తోందంటూ తూర్పు చైనా(Eastern China)కు చెందిన తల్లిదండ్రులు సుఝౌ వర్సిటీ హాస్పిటల్ తరలించారు. నొప్పి లేకున్నా అసౌకర్యంగా కనిపించగా, మెటల్ లాంటి వస్తువును ఎక్స్ రేలో గుర్తించారు. తొలుత మందులతో ప్రయత్నిస్తే బంగారు కడ్డీ మాత్రం కదల్లేదు. పేగులకు రంధ్రాలయ్యే ప్రమాదముందని భావించి పెద్దగా కోతలు లేని ఎండోస్కోపిక్ సర్జరీతో బిళ్లను బయటకు తీశారు. ఇందుకు 30 నిమిషాల సమయం పట్టగా, రెండ్రోజుల్లోనే బాలుడు కోలుకున్నాడు. చైనీస్ సోషల్ మీడియాలో ఇది హల్చల్ అయింది. చాక్లెట్ బార్ అనుకున్నాడా అని కొందరు.. అంత పెద్ద కడ్డీని ఎలా మింగాడు అని మరికొందరు పోస్టులు పెట్టారు.