దేశవ్యాప్తంగా విస్తృతంగా సాగుతున్న UPI పేమెంట్లపై GST విధిస్తున్నారన్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు లేకపోగా, త్వరలోనే వసూలు చేస్తారంటూ వార్తలు వచ్చాయి. రూ.2,000కు పైగా నిర్వహించే లావాదేవీలపై 18 శాతం GST విధించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలు అని ఆర్థిక శాఖ కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని, UPI లావాదేవీల్ని మరింత పెంచడమే లక్ష్యమని తెలిపింది.