అమెరికా కఠిన చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా(US Wide) 160 కళాశాలలు, యూనివర్సిటీల్లో 1,024 వీసాలు రద్దయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ సంస్థ అధ్యయనంలో తేలింది. హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్(Stanford), యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు అందులో ఉన్నాయి. గత మార్చి నుంచి విద్యార్థుల వీసాలపై దృష్టిపెట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ.. వరుసగా వాటిని రద్దు చేస్తూ సొంత దేశాలకు పంపుతోంది. ఈ పరిణామంతో అక్కడ చదివే విదేశీ విద్యార్థులు భయంతో కాలం గడుపుతున్నారు. అమెరికా అర్ధంతర నిర్ణయంపై అక్కడి కోర్టుల్లో సవాల్ చేస్తున్నాయి పలు విద్యాలయాలు.