మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదకద్రవ్యాలు(Drugs), కుట్ర కింద కేసులు వేశారు. డ్రగ్స్ సమాచారంతో రెండ్రోజుల క్రితం కొచ్చిలోని హోటల్లో తనిఖీలు జరిగాయి. పోలీసులు వస్తున్నారనగానే చాకో అక్కణ్నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. మూడో అంతస్తులోని కిటికీ నుంచి సెకండ్ ఫ్లోర్లోకి దూకి మెట్ల మీదుగా పారిపోయినట్లు అనుమానించారు. ఆ CCTV ఫుటేజీ వైరల్ గా మారింది. విచారణ కోసం శనివారం పోలీసుల ఎదుట చాకో హాజరయ్యాడు. అతడి వెంట్రుకలు(Hair), గోళ్ల శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించారు. త్రిశూర్ కు చెందిన ఇతడు తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ కాగా, తర్వాత నటుడిగా మారాడు. తెలుగులో దసరా, రంగబలి, డాకు మహరాజ్ సినిమాల్లో నటించాడు. మొన్నీమధ్య ఒక నటి సైతం ఆయనపై ఆరోపణలు చేసి మలయాళ ఇండస్ట్రీకి కంప్లయింట్ చేశారు.