ఆరు మ్యాచ్ ల్లో ఇప్పటికే 5 విజయాలతో పాయింట్ల టేబుల్ లో టాప్ లో ఉన్న ఢిల్లీ మరోసారి అదే జోరు చూపించింది. గుజరాత్ టైటాన్స్ ముందు 204 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఏ ఒక్కరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడకున్నా స్కోరు 200 దాటింది. పోరెల్(18), నాయర్(31), రాహుల్(28), అక్షర్(39), స్టబ్స్(31), అశుతోష్(37) ఇలా ప్రతి ఒక్కరూ తలో చెయ్యి వేశారు. గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీయడంతో ఢిల్లీ భారీ స్కోరుకు బ్రేకులు పడింది.