వాహనాల(Vehicles) ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రవాణా శాఖకు మరోసారి భారీగా ఆదాయం వచ్చింది. మొత్తంగా రూ.37,15,645 వసూలైంది. TG 09 F0001 నంబరుకు అత్యధికంగా రూ.7,75,000 రాగా.. దీన్ని బాలకృష్ణ నందమూరి దక్కించుకున్నారు. TG 09 F 0009కి రూ.6,70,000ను కమలాలయ హైసాఫ్ట్(hiisoft) ప్రై.లిమిటెడ్.. TG 09 F 0099కి రూ.4,75,999ను కాన్ క్యాప్ ఎలక్ట్రికల్ ప్రై.లిమిటెడ్ చెల్లించాయి. TG 09 F 0005ని రూ.1,49,999కి జెట్టి ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రై.లిమిటెడ్.. TG 09 F 0007ను రూ.1,37,779కి శ్రీనివాస్ నాయుడు.కె దక్కించుకున్నారు.