జోస్ బట్లర్(Joes Butler) జోష్ బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. తొలుత ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్ల షోతో ఢిల్లీని 203కు పరిమితం చేసి దాన్ని సులువుగా ఛేదించింది. సుదర్శన్(36), గిల్(7) ఔటైనా.. బౌలర్ల భరతం పట్టాడు బట్లర్. 54 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 19.2 ఓవర్లలో 204/3 చేసిన గుజరాత్.. 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలుపొందింది. జట్టును గెలిపించినా అతడి దురదృష్టం సెంచరీ చేయకపోవడమే. ఇంకా 2 ఓవర్లున్నా ఒక ఓవర్ రూథర్ ఫర్డ్(43), మరో ఓవర్ తెవాతియా(11 నాటౌట్) ఆడటంతో బ్యాటింగ్ ఛాన్సే రాలేదు బట్లర్ కు. చివరి ఓవర్లో తెవాతియా సింగిల్ తీస్తాడనుకుంటే వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో సెంచరీ కల సాకారం కాలేదు.