జర్మనీ పౌరసత్వం నిరూపణ కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు వేములవాడ మాజీ MLA చెన్నమనేని రమేశ్.. జరిమానా చెల్లించారు. ప్రత్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు రూ.25 లక్షల డీడీని తన న్యాయవాది ద్వారా అందించారు. తప్పుడు పత్రాలతో కొన్నేళ్లుగా వ్యవస్థల్ని మోసం చేస్తున్నారంటూ ఆయనకు రూ.30 లక్షల జరిమానా(Fine) విధించింది కోర్టు. అందులో రూ.25 లక్షల్ని MLA ఆది శ్రీనివాస్ కు, మరో రూ.5 లక్షల్ని లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ చెన్నమనేని రమేశ్ MLAగా గెలిచారని కోర్టు గుర్తించింది. ఈ కేసు పదిన్నర సంవత్సరాలు నడవగా, వాదనల సందర్భంగా తప్పుదోవ పట్టించినందుకు కోర్టు సీరియస్ అయింది.