స్టాక్ మార్కెట్లు లాభాల ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నాయి. జనవరి 6 తర్వాత వరుసగా ఐదో సెషన్లోనూ వృద్ధి కొనసాగింది. BSE సెన్సెక్స్ 79,600 మార్క్ కు చేరుకోగా, NSE నిఫ్టీ 24,150 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ 1,033, నిఫ్టీ 327 పాయింట్ల మేర పెరిగాయి. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సెర్వ్, HCL టెక్నాలజీ, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో కొనసాగాయి. అదాని పోర్ట్స్ సెజ్, ITC, HUL, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా నష్టాలు చవిచూశాయి.