భారతదేశంతో కయ్యం వద్దని, చర్చల(Diplomatic)తోనే సమస్య పరిష్కరించుకోవాలని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ ప్రధానికి సూచించారు. భారత్ పట్ల దూకుడు పనికిరాదని తన తమ్ముడైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు తెలిపారు. లాహోర్లో ఇద్దరూ భేటీ కాగా.. తాజా పరిణామాలను నవాజ్ కు షెహబాజ్ వివరించారు. దూకుడు ఎంతమాత్రం పనికిరాదన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్(PML-N) అధినేత.. సొంత దేశానికి పలు సూచనలు చేశారు. పహల్గామ్ దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం రద్దు కాగా.. భారత్ సైతం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఏ క్షణమైనా తమపై దాడి జరగొచ్చన్న పాక్ మంత్రి ఖవాజా అనుమానాల నడుమ.. దూకుడు తగ్గించుకోవాలంటూ నవాజ్ షరీఫ్ చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది.