చాలా కాలం తర్వాత IPL అంటే ఇలా ఉండాలని చూపించాడు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav). 17 బంతుల్లోనే 50 చేసిన అతడు 35 బాల్స్ లోనే సెంచరీ అందుకున్నాడు. 7 ఫోర్లు, 11 సిక్సులతో IPL చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అత్యంత వేగంగా వంద పూర్తి చేసిన ఘనత క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు 30 బంతుల్లో 100 చేశాడు. గుజరాత్ విసిరిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో దుమ్ముదులిపింది రాజస్థాన్. జైస్వాల్(70 నాటౌట్)-వైభవ్(101) జోడీ 62 బంతుల్లోనే 150 పరుగుల పార్ట్నర్ షిప్ జోడించింది. సిరాజ్, ఇషాంత్, రషీద్ వంటి కీలక బౌలర్లంతా వీళ్లు వికెట్లు తీయడంలో చేతులెత్తేశారు. 15.5 ఓవర్లలోనే 212/2 చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్.