గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు చీఫ్ జస్టిస్(CJ) బెంచ్ నిరాకరించింది. 18 మంది అభ్యర్థుల పిటిషన్ పై ఈ నెల 17న ఆదేశాలు జారీ కాగా.. ఈ మధ్యంతర ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ TGPSC అప్పీల్ పిటిషన్ వేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఉద్యోగాలు భర్తీ చేద్దామంటే సింగిల్ బెంచ్ నిర్ణయం అడ్డుకునేలా ఉందని కమిషన్ తరఫున వాదించారు. అయితే కేసులో జోక్యానికి ధర్మాసనం నిరాకరిస్తూ.. సింగిల్ బెంచ్ వద్దే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అవసరమైతే సత్వర విచారణ పూర్తికి ఆదేశాలిస్తామని స్పష్టం చేస్తూ కేసును ముగించింది. నియామక పత్రాలు ఇవ్వొద్దంటూనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రం పూర్తి చేయొచ్చంటూ ఇంతకుముందు ఆదేశాలు జారీ కాగా దీన్ని TGPSC సవాల్ చేసింది.