పదోతరగతి(Tenth) ఫలితాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో విడుదల చేశారు. www.bse.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలకు 5 లక్షల మంది హాజరయ్యారు. 92.78 శాతం ఉత్తీర్ణత రాగా.. గత సవంత్సరం కంటే 1.47 శాతం ఎక్కువ మంది పాసయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం ఉత్తీర్ణులు కాగా, గతేడాది కంటే 4 శాతం పెరిగింది. ఇక గురుకుల స్కూళ్లల్లో 98.7 శాతం మంది పాసయ్యారు. సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లను SSC బోర్డు ప్రకటించింది.