పదో తరగతి ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. రెగ్యులర్, ప్రైవేటు రెండింట్లోనూ అమ్మాయిలదే హవా. రెగ్యులర్ ఉత్తీర్ణత 92.78% కాగా.. బాలికలు 94.26%, బాలురు 91.32% ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు 2.94% అధికంగా పాసయ్యారు. ప్రైవేటు ఉత్తీర్ణత 57.22% కాగా.. బాలికలు 61.70%, బాలురది 55.14%. ఇందులో 6.56% ఎక్కువగా అమ్మాయిలదే పైచేయి. ఈసారి 4,629 స్కూళ్లు 100% ఉత్తీర్ణత సాధిస్తే, కేవలం రెండు పాఠశాలలు మాత్రమే సున్నా శాతం నమోదు చేశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 99.29%తో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో… అతి తక్కువ ఉత్తీర్ణత 73.97%తో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచాయి.