కులగణన(Caste Enumeration) చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రాబోయే జనాభా లెక్కల సమయంలో కులగణన నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సామాజికవర్గాల వారీగా లెక్కలు తేలనున్నాయి. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న వేళ.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు నిర్వహించిన సర్వేల ద్వారా ప్రజల్లో అనుమానాలు నెలకొన్న దృష్ట్యా, అందుకు భిన్నంగా పూర్తి పారదర్శకంగా సర్వే నిర్వహించాలన్నది కేంద్రం లక్ష్యం. ఈ సర్వే ద్వారా సామాజిక, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుందని కేంద్రం భావిస్తోంది.