తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary)గా కె.రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. వరుసగా 11 బడ్జెట్లు ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారు. 1991 IAS బ్యాచ్ కు చెందిన ఆయన ఇప్పటిదాకా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. 1989 బ్యాచ్ కు చెందిన శాంతికుమారి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.