సమస్యలు పరిష్కరించాలంటూ TSUTF రేపు ఛలో SPD(state project director) కార్యక్రమాన్ని చేపడుతోంది. KGBV, URS(అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్), SS(సమగ్ర శిక్షా) విభాగాల సిబ్బందికి కనీస వేతనం(basic pay) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ SPD నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీచర్లు, ఇతర సిబ్బంది పెద్దసంఖ్యలో తరలివచ్చేలా నాయకులు కార్యాచరణ సిద్ధం చేశారు. మూడు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి కనీస జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారంటూ TSUTF పోరాటం చేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమం చేయాలని ఏప్రిల్ 27న జరిగిన ఉద్యోగుల సదస్సు తీర్మానించింది. ఆ మేరకు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరికీ వినతి పత్రాలు అందజేసింది. మే 22న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేసింది. తర్వాత జూన్ 24న ఛలో SPD చేపట్టాలని భావించింది.
అయితే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల తర్వాత సమస్య పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి హామీ ఇవ్వడంతో దాన్ని వాయిదా వేసింది. కానీ అక్కణ్నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఆ SPD ప్రోగ్రాంను రేపు జరపబోతోంది. మొత్తం 29 డిమాండ్లను TSUTF ప్రభుత్వం ముందు ఉంచుతోంది.
29 డిమాండ్లలో కొన్ని…
సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
CM ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
రెగ్యులరైజ్ కోసం అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలి.
మోడల్ స్కూల్స్ నిర్వహణ అదనపు బాధ్యతల నుంచి SOలను తప్పించాలి.
జూనియర్ కాలేజీలకు అదనపు సిబ్బందిని, నిధులను కేటాయించాలి.
URS సిబ్బందికి వీక్లీ ఆఫ్ లు ఇవ్వాలి.