TGSRTC కార్మికులు చేపట్టబోయే సమ్మె(Strike) వాయిదా పడింది. యూనియన్లతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు ఫలించాయి. సమస్యల పరిష్కారంపై RTC యూనియన్లు సమ్మె హెచ్చరికలు ఇవ్వగా.. ఆ డిమాండ్లపై ప్రభుత్వం చర్చించింది. MLC కోదండరామ్, CPI MLA కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు.. మంత్రితో చర్చలు జరిపాయి. ఉద్యోగుల విలీనం, వేతన సవరణ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, DAలు, అలవెన్సులు ప్రధాన డిమాండ్లు కాగా.. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సంఘాలు ప్రకటించాయి. అయితే రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు IASలు నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్ తో కమిటీ ఏర్పాటు చేసింది.