దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసు(OMC)లో ఐదుగురిని దోషులుగా తేల్చిన నాంపల్లి CBI కోర్టు.. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బావమరిది బి.వి.శ్రీనివాసరెడ్డి, PA కె.మెఫజ్ అలీఖాన్, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ ను దోషులుగా తేల్చింది. సర్కారుకు రూ.800 కోట్లు నష్టం కలిగించిన కేసులో వీరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత IAS కృపానందంను నిర్దోషులని తీర్పునిచ్చింది. 2009లో కేసు నమోదు కాగా.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దర్యాప్తుకే ఐదేళ్లు పట్టగా, సుదీర్ఘ విచారణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 10లోపు తీర్పు వెలువరించాలంటూ సుప్రీం టైమ్ లైన్ విధించడంతో రోజువారీ విచారణ నిర్వహించి తీర్పు ప్రకటించింది.