ఉగ్రవాదం(Terrorism)పై భారత్ పోరాటానికి ఖతార్(Qatar) మద్దతు ప్రకటించింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)లో సభ్య దేశమైన ఖతార్.. మిగతా దేశాలకు భిన్నంగా భారత్ గళం వినిపించింది. ప్రధాని మోదీతో ఆ దేశ అమిర్ అయిన షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ లో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఖతార్ మద్దతుపై సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని.. తమీమ్ బిన్ కు కృతజ్ఞతలు తెలిపినట్లు విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. OIC లో 22 సభ్యదేశాలుంటే, కొన్ని ఇప్పటికీ పాకిస్థాన్ వెనుకే ఉన్నా.. ఖతార్ మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది తొలినాళ్లలో దేశంలో అమిర్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి.