BJP MLA రాజాసింగ్ ను మరో శాసనసభ్యుడు ఈటల రాజేందర్ కలిశారు. పలు విషయాలు చర్చించిన ఆయన.. BRS తీరుపై ఫైర్ అయ్యారు. BJP నేతలపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, గోషామహల్ లో ఎలాగైనా గెలిచేందుకు పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈటల మండిపడ్డారు. కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో హైకమాండ్ త్వరలోనే డిసిషన్ తీసుకుంటుందని ఈటల తెలిపారు. ఈ భేటీని చూస్తే రాజాసింగ్ లో ఉన్న అసంతృప్తిని ఈటల తొలగిస్తారా అన్న చర్చ జరుగుతోంది.
గతేడాది ఆగస్టులో ముస్లింలకు సంబంధించిన వీడియో(Video)ను రాజాసింగ్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, దానిపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో BJP హైకమాండ్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. లెజిస్లేటివ్ పార్టీ నేతగానూ తప్పించింది. రాజాసింగ్ పై సదరు మతానికి చెందిన వ్యక్తులు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో ఆయన్ను అరెస్టు చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ PD యాక్ట్ పెట్టి రెండోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. కొద్దిరోజులకు ఆయన విడుదలై బయటకు వచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ నాలుగు రోజుల క్రితం హరీశ్ రావుతో మీట్ అవ్వడం సంచలనంగా మారింది. ఆయన త్వరలోనే పార్టీ మారతారా అన్న అనుమానాలు అందరిలోనూ కనిపిస్తున్నాయి. అయితే సెగ్మెంట్ డెవలప్ మెంట్ కోసమే హరీశ్ ను కలిసినట్లు రాజాసింగ్ చెప్పినా.. అనుమానాలు పోలేదు. దీంతో ఇప్పుడు రాజాసింగ్ ను ఈటల కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.