తాజా దాడులపై పాకిస్థాన్ రెచ్చగొడితే బుద్ధి చెప్పడమేనంటూ భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిగిన తీరును చైనా సహా సహచర దేశాలకు(Counterparts) వివరించింది. ‘కోపంతో కాకుండా భారత్ ఇంకా సంయమనంతో ఉంది.. ఈ దాడుల్ని తీవ్రతరం చేసే ఉద్దేశం లేదు.. కానీ పాకిస్థాన్ రెచ్చగొడితే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం..’ అని దౌత్యాధికారి స్పష్టం చేశారు. రష్యా జాతీయ భద్రతా సలహాదారు(NSA) సెర్గీ షోయిగు, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ, ఫ్రెంచ్ అధ్యక్షుడి సలహాదారుతో భారత్ చర్చించింది. అటు అజిత్ దోవల్ సైతం అమెరికా, ఇంగ్లండ్, సౌదీఅరేబియా, జపాన్ ప్రతినిధులతో మాట్లాడారు. ఓవర్ యాక్షన్ చేయాలని చూస్తే పాక్ పని పడతామంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు.