భారత ఫైటర్ జెట్లను పలుచోట్ల(Locations) పాకిస్థాన్ కూల్చివేసిందంటూ చైనా మీడియా చేసిన ప్రచారంపై మోదీ సర్కారు మండిపడింది. పూర్తి ఆధారాలు తెలుసుకుని కథనాలు రాయాలంటూ గ్లోబల్ టైమ్స్ న్యూస్ మీడియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నిన్న రాత్రి జరిపిన దాడుల్లో ఒకదాని వెంట ఒకటిగా మూడు ఫైటర్ జెట్లను పాక్ కూల్చేసిందంటూ రాసిన వార్తల్ని ఆ మీడియా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి భారత విదేశాంగశాఖ జవాబిస్తూ..’డియర్ గ్లోబల్ టైమ్స్ న్యూస్.. మీకున్న ఆధారాల్ని క్రాస్ చెక్ చేసుకోండి.. వాటిని క్షుణ్నంగా పరిశీలించి వార్తలు ఇవ్వండి..’ అంటూ కౌంటరిచ్చింది.