ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన చెన్నై(CSK).. కోల్ కతా నైట్ రైడర్స్(KKR) భారీ స్కోరు చేయకుండా ఆపింది. నూర్ అహ్మద్ 5 వికెట్ల దెబ్బతో నైట్ రైడర్స్ పరుగులకు అడ్డుకట్ట పడింది. అయితే ఎవరూ పెద్దగా నిలవకున్నా తలో చేయి వేసి టీంను నిలబెట్టారు KKR ఆటగాళ్లు. గుర్బాజ్(11), నరైన్(26), రహానె(48), మనీశ్ పాండే(29), రసెల్(38) రాణించారు. రింకూసింగ్(9), రఘువంశీ(1) తొందరగా ఔటయ్యారు. 6 వికెట్లకు 179 పరుగుల వద్దే ఆగిపోయింది KKR.