టెర్రరిజం విషయంలో ఇన్నేళ్లూ దొంగనాటకాలాడిన పాకిస్థాన్.. ఇప్పుడు నిజరూపాన్ని బయటపెట్టుకుంది. భారత్ దాడికి దిగుతుందన్న సమాచారంతో… ఉగ్ర నేతను ముందుగానే తప్పించింది. బహవల్పూర్లోని జైషే మహ్మద్ భవనంపై క్రూయిజ్ క్షిపణులు పడ్డ వేళ.. అక్కడ మసూద్ లేడు. కానీ అతడి కుటుంబంలో 10 మందితోపాటు నలుగురు జైషే నాయకులు హతమయ్యారు. కరాచీ-తోర్ఖం హైవే-5లో 15 ఎకరాల్లో మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంగణం ఉంది. ఇందులో జైషే చీఫ్ మసూద్, యాక్టింగ్ చీఫ్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, మౌలానా అమ్మర్ ఇళ్లు ఉన్నాయి. అయితే మసూద్ ప్రస్తుతం పాకిస్థాన్ అధికారుల కస్టడీలో ఉన్నాడని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇస్లామాబాద్ లేదా రావల్పిండిలోని గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నట్లు తేల్చారు.