ఉగ్రవాద శిబిరాల వినాశనమే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Sindoor)’ కంటిన్యూ అవుతుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీన్ని ఆపేది లేదంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. అఖిలపక్ష భేటీలో తెలియజేశారు. 21 ప్రధాన ఉగ్రవాద కేంద్రాలు గుర్తించగా, అందులో తొమ్మిది చోట్ల నిన్న సైన్యం దాడులకు దిగింది. ఈ దాడుల్లో 100 మంది హతమవగా, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ కుటుంబంలోని 10 మంది చనిపోయారు. ఈ ఆపరేషన్ కొనసాతుందని రాజ్ నాథ్ చెప్పారంటూ రాహుల్ గాంధీ అన్నారు. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధమన్నారు.